Monday, December 23, 2024

ఖర్గే కుటుంబ ట్రస్టుకు 19 ఎకరాల సర్కారు భూమి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టు నిర్వహించే విద్యా సంస్థకు కర్నాటక ప్రభుత్వం 19 ఎకరాల భూమిని ఉచితంగా అప్పగించిందని బిజెపి ఎంపి లహర్ సింగ్ సిరోయ సోమవారం ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండు చేశారు. కలబురగిలో ట్రస్టు నిర్వహించే అంతర్జాతీయ పాలి, సంస్కృత,

సారూప్య సిద్ధాంతసంస్థకు ఈ భూమిని అప్పగించినట్లు తాజా దస్త్రాలు వెల్లడిస్తున్నాయని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. ట్రస్టీలుగా మల్లికార్జున్ ఖర్గే భార్య, అల్లుడు, ఇద్దరు కుమారులు ఉన్నారని ఆయన చెప్పారు. ఈ సంస్థ కార్యదర్శిగా ఖర్గే అల్లుడు, స్టింగ్ ఎంపి రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ట్రస్టుకే ఇటీవల బెంగళూరు సమీపంలోని ఏరోస్పేస్ పార్కులో ఐదు ఎకరాల పౌర సౌకర్యాల భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News