Friday, January 10, 2025

ఆదుకుంటాం.. అండగా ఉంటాం:సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తున్న క్రమంలోనే సిఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ పోస్ట్ చేశారు. ‘కష్టాల్లో తోడుగా.. కన్నీళ్లలో అండగా.. వరద బాధితులను నేరుగా కలిసి’ తమ ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా కల్పించే ప్రయత్నం చేశాను. ఖమ్మం ఎఫ్‌సిఐ రోడ్డులో మున్నేరు వరద ప్రభావిత కాలనీలో బాధితులతో ముఖాముఖి మాట్లాడాను.

తక్షణ సాయంగా కుటుంబానికి రూ.10 వేలు అందజేయాలని నిర్ణయించాం. ‘ఆదుకుంటాం.. అండగా ఉంటాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కాలనీలో పర్యటించిన ఫొటోలను ఎక్స్ ఖాతాలో సిఎం రేవంత్ పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజల పక్షపాతి మన రేవంతన్నా అంటూ నెటిజన్లు సిఎంను కొనియాడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News