Tuesday, December 3, 2024

నిజాంపేటలో ఎస్ఆర్ జూనియర్ కాలేజీలోకి చేరిన వరద నీరు… భవనం సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ ప్రాంతం నిజాంపేటలోని హిల్ కౌంటి వద్ద ఎస్ఆర్ జూనియర్ కాలేజీ నీటిలో మునిగిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంపేట్ హిల్ కౌంటీ ఎదురుగా ఉన్న పత్తి కుంటలో భారీగా వర్షపునీరు చేరింది. చెరువులో నిర్మించిన భవనంలో ఎస్ఆర్ కాలేజీలోకి వరద నీరు వచ్చి చేరింది. ఎస్సార్ జూనియర్ కాలేజ్ భవనం సెల్లార్ లోకి నీరు వస్తుందన్న సమాచారంతో నిజాంపేట్ కార్పొరేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ ఇంటర్ చదువుతున్నటువంటి దాదాపు 300 మంది విద్యార్థులను పక్కన ఉన్నటువంటి సప్తపది ఫంక్షన్ హాల్ లోకి అధికారులు తరలించారు. అదే విధంగా ఎస్స్ఆర్ జూనియర్ కాలేజ్ భవనాన్ని అధికారులు సీజ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News