Sunday, December 22, 2024

వివాహేతర సంబంధం ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్.. భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఒక మహిళతో ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ వివాహేతరం సంబంధం పెట్టుకోవడంతో భార్యను భర్త హత్య చేశాడు. దీంతో ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన సంఘటన తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో ఉళుందూర్ పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పిల్లూర్ ప్రాంతంలో అశోక్(35), రమణి(32) అనే దంపతులు నివసిస్తున్నారు. తిరునావలూరు ఎస్‌ఐ నందగోపాల్‌తో రమణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భార్యతో పలుమార్లు అశోక్ గొడవ పెట్టుకున్నాడు. దంపతులు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను భర్త ఈ నెల 19న హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. భర్తను అదుపులోకి తీసుకొని విచారించగా ఎస్‌ఐ వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. విళుపురం రేంజ్ డిఐజి దిశా మిట్టల్ రంగంలోకి దిగి విచారించగా నిజమనే తేలడంతో ఎస్‌ఐ నందగోపాల్‌ను సస్సెండ్ చేశారు. రమణితో వివాహేతర సంబంధం పెట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ ప్రభాకరన్‌ను కూడా సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News