మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్ అండ్ బి ఈఎన్సీ ప దవికి గణపతిరెడ్డి రాజీనామా చేశారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం అంచనాల పెంపుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే గణపతి రెడ్డి మంగళవారం రాజీనామా చేయడం విశేషం. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్న గణపతిరెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్‌కు రాజీనామా లేఖను అందజేశారు.
2017లోనే గణపతిరెడ్డి రి టైర్‌మెంట్ అయినా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆయన్న అదే పదవిలో కొనసాగిస్తోంది. తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొమ్మిది నెలలుగా ఈఎన్సీగా గణపతిరెడ్డినే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణ బాధ్యతలను గణపతిరెడ్డి చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఎన్‌హెచ్ నెంబర్ కేటాయింపుతో పాటు కేంద్రంతో సంప్రదింపుల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గణపతి రెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆ అధికారి కనుసన్నల్లోనే గణపతిరెడ్డి విధులు
గణపతిరెడ్డి ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో కొత్త సెక్రటేరియట్, ప్రగతి భవన్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కలెక్టరేట్లు, సెక్రటేరియట్ ఎదుట అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, జిల్లాల్లో మెడికల్ కాలేజీలు నిర్మించారు. నిర్మాణం జరిగింది. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, హైదరాబాద్‌లోని టిమ్స్ ఆసుపత్రుల అంచనాల పెంపుపై విజిలెన్స్ విచారణ కొ నసాగుతున్న నేపథ్యంలో గణపతిరెడ్డి రాజీనామా చేయ డం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.