Monday, December 23, 2024

లార్డ్స్ లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమరం

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (202325) ఫైన ల్ పోరు చారిత్ర క లార్డ్ మైదానంలో జరుగనుంది. 2025 జూన్ 11 నుంచి 15 వరకు లండన్‌లో లార్డ్‌లో డబ్లూటిసి ఫైనల్ పోరు జరుగనుంది. లార్డ్‌లో డబ్లూటి సి ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. తొలి సీజన్ ఫైన ల్ సౌత్ హాంప్టన్‌లో జరగగా, రెండో ఎడిషన్ ఫైనల్ ఓవల్ మైదానంలో జరిగింది.

భారత్ రెండు సార్లు కూడా ఫైనల్‌కు చేరినా ట్రోఫీ మాత్రం సాధించలేక పోయింది. తొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో కంగుతిన్నది. ఈసారి కూడా భారత్ ఫైనల్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ పాయింట్ల పరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇందులో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో కూడా భారత్ సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల తర్వాత డబ్లూటిసి ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యే అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News