Friday, January 3, 2025

పార్టీ ఫిరాయింపుదార్లకు పెన్షన్లు కట్ ?

- Advertisement -
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీలు ఫిరాయించే ఎమ్మెల్యేలకు పింఛన్లు ఉండవు. ఈ కోత విధించే రీతిలో ఓ బిల్లును కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీకి వెళ్లే ఎమ్మెల్యేలకు పెన్షన్ సౌకర్యం లేకుండా చేసే ఈ బిల్లును సభ ఆమోదించింది. హిమాచల్ ప్రభుత్వం ఈ అసాధారణ బిల్లును తీసుకురావడం, ఆమోదింపచేసుకోవడం, ఫిరాయింపుల వ్యతిరేక ప్రక్రియలో కీలక ఘట్టం అయింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఈ బిల్లు వర్తిస్తుంది. వీరిపై వేటుపడుతుంది. బిల్లును రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రవేశపెట్టారు. హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ( సభ్యుల అలవెన్స్‌లు, పెన్షన్లు) సవరణ బిల్లు 2024 పేరిట దీనిని తీసుకువచ్చారు.

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పరిధిలో ఏ దశలో అయినా సభ్యులు అనర్హతకు గురైతే అటువంటి వ్యక్తి చట్టం పరిధిలో పెన్షన్, ఇతరత్రా అలవెన్స్‌లకు అర్హులు కారని ఈ బిల్లులో పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ నడుమ తరచూ అధికార మార్పిడి, ఈ క్రమంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరిగే ఈ రాష్ట్రంలో ఈ బిల్లు అత్యంత కీలకమైనది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలో ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించారు. కొన్ని రాష్ట్రాలలో తరచూ పార్టీల ఫిరాయింపులు జరుగుతున్న దశలో ఈ రాష్ట్రంలో ఇప్పుడు తీసుకువచ్చిన బిల్లు పలు రకాలుగా రాజకీయ ప్రకంపనలకు దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News