Tuesday, December 3, 2024

పెళ్లైన పదిహేను రోజులకే బాత్రూమ్ లో ఉరేసుకున్న నవ వధువు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: పెళ్లైన పదిహేను రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కనక భాగ్యలక్ష్మి(24), మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్‌ను ఆగస్టు 18న పెళ్లి చేసుకుంది. ఉదయ్ హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుండగా తన భార్యతో కలిసి భాగ్యనగరంలో ఉంటున్నాడు. శనివారం భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లి తన కూతురును తక్కళ్లపల్లి గ్రామానికి తీసుకొచ్చారు.

నవ వధువు తన తల్లిగారింట్లో ఆనందంగా గడిపింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లి బయటకు రాలేదు. బాత్రూమ్ నుంచి కూతురు బయటకు రాకపోవడంతో బలవంతంగా ఓపెన్ చేసి చూడగా ఉరేసుకొని కనిపించింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాను ఎవరి కారణం వల్ల ఆత్మహత్య చేసుకోలేదని, తనని ఎవరు ఇబ్బంది పెట్టలేదని, తనకు ఈ లోకంలో ఉండడం ఇష్టం లేకనే చనిపోతున్నానని భాగ్య లక్ష్మి సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. కుమార్తె మృతిపై ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నరేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News