Thursday, September 19, 2024

నాగ చైతన్య స్మైలింగ్ లుక్

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ నాగచైతన్య 2009లో జోష్ సినిమాస్‌తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోగా ఎదిగారు. విలక్షణమైన పాత్రలలో అనేక సూపర్ హిట్‌లను అందించిన చైతన్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య మోస్ట్ ఎవైటెడ్ మూవీ తండేల్ మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో రగ్గడ్ అవతార్‌లో కనిపించిన చైతన్య తన చిరునవ్వుతో కట్టిపడేశారు.

చైతు సముద్రం దగ్గర ఫిషింగ్ బోట్ మీద నిలబడి కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News