Friday, December 20, 2024

పిల్లలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తమ చిన్నారులతో పాటు చెరువులో దూకిన ఓ మహిళ శవమై తేలిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దచెరువులో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈసంఘటనకు సంబందించి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..వనస్థలిపురంలో నివాసముండే మంగ (38) తన కుమార్తె లావణ్య, కుమారులు శరత్, విఘ్నేశ్‌లతో కలసి గురవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వద్దకు చేరుకుంది. సుమారు 7 గం.ల ప్రాంతంలో తమ చిన్నారులతో పాటు చెరువులో దూకింది.

కాగా తల్లి మంగతోపాటు కుమారుడు శరత్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. విగ్నేష్ చెరువులో నుండి బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. కూతురు లావణ్య ఆచూకీ తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు గాలింపు చేపట్టినట్లు సమాచారం. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫోటోరైటప్‌ః

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News