Sunday, December 22, 2024

జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత… భావోద్వేగంతో సిఎం రేవంత్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపారు. జిట్టా మరణంపై రేవంత్ తన ట్విట్టర్‌లో భావోద్వేగానికి గురయ్యారు. మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. యువతను ఐక్యం చేసి చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక ప్రాత పోషించారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రేవంత్ ట్వీట్ చేశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. యశోదాస్పత్రిలో చికిత్స తీసుకుంటూ జిట్టా తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News