Sunday, January 5, 2025

వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య విషయంలో మౌనం ఎందుకు..?:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది..? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. వరదల కారణంగా 31 మంది మృతి చెందారని, వారి వివరాలను బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 16 మంది మాత్రమే మృతి చెందినట్లు చెబుతోందని, మృతుల సంఖ్య అంతే అని ఏ విధంగా నిర్ధారణకు వచ్చారని అడిగారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇంత మంది చనిపోయారని, బాధితుల పేర్లు, వివరాలు ప్రజలకు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. తప్పుడు లెక్కలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు. అదేవిధంగా మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి గతంలో డిమాండ్ చేసిన విధంగా ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News