- Advertisement -
హైదరాబాద్: భాగ్యనగరం జంట జలాశయాలు గేట్లు ఎత్తివేశారు. భారీ వర్షాలు కురవడంతో జంట జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువులో ఉన్నాయి. ఉస్మాన్ సాగర్ రెండు గేట్ల ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ ఒక గేటు ఒక అడుగు ఎత్తి నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 1761.1 అడుగులకు చేరుకుంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1787 అడుగులకు చేరింది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారుల అప్రమత్తం చేశారు.
- Advertisement -