Friday, December 20, 2024

కార్డ్ నెట్‌వర్క్ విషయంలో RBI కొత్త నిబంధన

- Advertisement -
- Advertisement -

మనం డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే..దానిపై వీసా, మాస్టర్ కార్డ్, రూపే మొదలైనవి రాసి ఉంటాయి. చాలా వరకు అవి మనకు అర్థం కావు. అయితే, అదంతా కార్డ్ నెట్‌వర్క్ అని చెప్పవచ్చు. మొబైల్‌లో సిమ్ కార్డ్ నెట్‌వర్క్ ఉన్నట్లే..క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లకు కూడా నెట్‌వర్క్ ఉంటుంది. కాగా, కేవలం ఈ కార్డ్ నెట్‌వర్క్ కంపెనీలు మాత్రమే కార్డును జారీ చేస్తాయి. ఇప్పటి వరకు కస్టమర్ ఏ కార్డ్ నెట్‌వర్క్‌ను పొందాలో బ్యాంక్ నిర్ణయించేది. అయితే,  ఇప్పుడు అలా జరగదు. కార్డ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన కొత్త నిబంధనలు వచ్చాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చిలో కార్డ్ నెట్‌వర్క్‌కు సంబంధించి సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం..ఇప్పుడు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌ని జారీ చేసే ముందు..బ్యాంకులు లేదా నాన్-బ్యాంకులు (NBFCలు) కస్టమర్ ఏ కార్డ్ నెట్‌వర్క్‌ని ఎంచుకోవాలనుకుంటున్నారో అడుగుతారు. అంటే కస్టమర్ తనకు నచ్చిన విధంగా కార్డ్ నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో 5 కార్డ్ నెట్‌వర్క్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అవి కస్టమర్ వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్‌.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News