Saturday, December 21, 2024

హైడ్రా అవసరం లేదు.. మేమే కూల్చేస్తాం: నటుడు మురళీమోహన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా అధికారులు ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. 33 ఏళ్లుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, తాను ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని మురళీమోహన్ తెలిపారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్టు అధికారులు గుర్తించారని, అందుకు హైడ్రా అధికారులు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, తామే ఆ షెడ్డును కూలుస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌, బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో హెచ్ఎండిఎ పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News