Sunday, November 24, 2024

బెంగాల్ ప్రభుత్వాన్ని మందలించిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కోల్ కతా హత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. శవ పరీక్ష పత్రం(అటోప్సీ డాక్యమెంట్) ఎలా మాయం అయిందన్న విషయాన్ని వివరించాలని పేర్కొంది. అసలు పశ్చిమ బెంగాల్ తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలపాలని సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ ను న్యాయమూర్తి జెబి పార్దివాలా నిలదీశారు.

పశ్చిమ బెంగాల్ లోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఓ ట్రెయినీ డాక్టర్ హత్యాచారంకు గురి అయిన కేసును సుప్రీం కోర్టు సుమోటోగా చేపట్టింది. పోస్ట్ మార్టం లో శవపరీక్ష పత్రం మిస్ అయిందంటే మీరు వివరించాల్సి ఉంటుంది అని కపిల్ సిబాల్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి పార్దివాలా మందలించారు. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, న్యాయమూర్తి మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డాక్యుమెంట్ విషయంలో అఫిడవిట్ ను సమర్పిస్తుందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కు నేతృత్వం వహిస్తున్న కపిల్ సిబాల్ తెలిపారు. ఇదిలావుండగా బాధితురాలు చావు, ఎఫ్ఐఆర్ దాఖలు మధ్య 14 గంటల ఆలస్యం ఉందని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అన్నారు.

Supreme Court Bench

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News