Thursday, December 19, 2024

పకడ్బందీ అంచనా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వరద బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉం టుందని -రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌ రసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చి వరి బాధితుని వరకు సహాయం అందిస్తామ ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సిఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వి పత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ము ఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్, వ్యవసాయ, పంచాయి తీ రాజ్, విద్యుత్, విద్యా, రోడ్లు, హౌసింగ్, ఇరిగేషన్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు కావల్సిన అంశాలపై పకడ్బందీగా అంచనా వేయాలని సూచించారు. కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పొందుపరచాల్సిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వరద ప్రాంతాలలో ఎన్యూమరేషన్ కూడా పక్కాగా జరగాలని సూచించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రిగారికి వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రతిపాదికన బాధితులకు సహాయమందించాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, ఇందిరమ్మ ఇలు ్ల:
భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని 33 జిల్లాలను వర్షాప్రభావిత జిల్లాలుగా ప్రకటించామని తెలిపారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 33 మంది మృతి చెందారని ఇందులో ప్రధానంగా ఖమ్మంలో 6 మంది, కొత్తగూడెంలో 5 మంది, ములుగులో 4 మంది, కామారెడ్డిలో ముగ్గురు, వనపర్తిలో ముగ్గురు చనిపోయారని అధికారులు మంత్రిగారికి వివరించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని కూడా అందచేయాలని అధికారులను మంత్రిగారు ఆదేశించారు.

ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు : ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇండ్లు పూర్తిగా పాక్షికంగా కూలిపోయాయి. వీటిని వెంటనే గుర్తించి బాధితులకు రూ. 5 లక్షల రూపాయలతో ఉచితంగా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

ప్రతి కుటుంబానికి రూ.16,500: వర్షాలలో దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.16,500 చొప్పున సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా వరద సహాయం పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే బాధితుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని వెల్లడించారు. వరద సమయంలో ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారని, అయితే జరిగిన నష్టాన్ని చూసి మానవతా ధృక్పథంతో రూ.16,500 కి పెంచినట్టు వెల్లడించారు. ఈ సహాయాన్ని బాధితులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం : రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షలాది ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. వరద ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి రూ.పదివేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముప్పుకు గురి కాగా, దాదాపు 2 లక్షల మంది ప్రభావితమైనట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందస్తు చర్యల వల్ల 2,454 మందిని రక్షించామని తెలిపారు. 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో ఆర్‌అండ్‌బి, పంచాయితీ రాజ్ విభాగాలకు సంబంధించి వేలాది కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికే తాత్కాలిక మరమత్తులు చేపట్టి కొన్ని రోడ్లను పునరుద్ధరించామని చెప్పారు. శాశ్వత ప్రతిపాదికన మరమత్తులు చేపట్టడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రెండు మూడు రోజుల్లో తయారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన మరమత్తులను శాశ్వత ప్రతిపాదికన చేపట్టాలని సూచించారు. తాత్కాలిక మరమత్తులతో ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చని మంత్రిగారు అభిప్రాయపడ్డారు. అంగన్వాడీ, ప్రభుత్వ ఆసుపత్రులు, పాటశాలలు, ప్రాథమిక హెల్త్ సెంటర్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న వివరాలను 24 గంటల్లో సచివాలయంలోని ఆయా విభాగాలకు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రతి గింజను కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఆ నష్టాన్ని వారినుండే వసూలు చేయాలి : మైన్స్ కు సంబంధించి వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో పోయడం వల్లనే సూర్యపేట, పాలేరుకు భారీగా నష్టం జరిగిందన్నారు. ఆ వ్యర్థాలతో వరద నీరు పోవడానికి వీలు లేకుండా పోయిందని, జరిగిన నష్టాన్ని ఆ ఏజెన్సీల నుంచే వసూలు చేయాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు. రెండు ఏజెన్సీలు 18 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను పోశారని అధికారులు వివరించారు. భారీ వర్షాలు, వరదలకు చాలా ఇండ్లల్లోకి నీరు చేరి ఇంటి యజమాని భూ పత్రాలు, ఆస్తి పత్రాలు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులతో పాటు విలువైన పత్రాలు తడిచిపోయి కొట్టుకుపోయాయని, ఈ బాధితులందరూ స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఆ డూప్లికేట్ పత్రాలను అందిస్తారని, ఈ విషయంలో బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News