Thursday, December 19, 2024

హైడ్రా పరిధి పెంపు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో : హైడ్రాను రీజినల్ రింగ్ రోడ్ వరకు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వర కు హైడ్రా విస్తరిత ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ లోపలి వరకు మాత్రమే ఉన్నది. అ యితే, హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమనిర్మాణాదారుల చిట్టా బయటపడటం, చెరువుల్లోకి వచ్చే నిర్మాణాలను తొలగించడం, చెరువుల్లో నిర్మాణాలంటే భయపడే పరిస్థి తి ఇటు నిర్మాణాదారుల్లోనూ, అటు కొనుగోలు దారుల్లోనూ వచ్చిందనేది ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇక ముందు చెరువుల్లోకి నిర్మాణాలు వస్తే ఎప్పటికైనా ప్ర మాదమనేది ప్రజల్లో ఏర్పడిందనీ, ఇక ముందు ఔటర్ వెలుపల కూడా చెరువుల ను పరిరక్షించాలంటే హైడ్రా అక్కడ వరకు ఉండాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉన్నట్టు హైడ్రా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల్లోనూ మార్పు వస్తుందనీ, నీటి వనరులు ఉన్న చోట ఇండ్లు కొనుగో లు చేయాలంటే ముందుగా అన్ని అనుమతులు ఉన్నాయా? లేవా? ఎఫ్‌టిఎల్, బఫ ర్ జోన్లలోకి వస్తాయా.? అనేది కూడా స మగ్రంగా సమాచారం సేకరించిన అనంతరమే కొనుగోలు చేసే పరిస్దితులు నెలకొన్నాయి.

దీఇని వెనుక హైడ్రా చర్యలే కీలకపాత్ర పోషించాయని ప్రభుత్వం భావించి రీజినల్ రింగ్ రోడ్ వరకు హైడ్రాను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. హైడ్రా రంగ ప్రవేశంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులపై ప్రజల్లో పెనుమార్పు వచ్చిందనీ, ఈ నేపథ్యంలోనే హైడ్రాను రీజినల్ రింగ్ రోడ్ వ రకు విస్తరించి ఔటర్ వెలుపల ఉన్న చెరువులను కాపాడే దశగా ప్రభుత్వం స్టెప్ తీసుకోనున్నట్టు సమాచారం ఓఆర్‌ఆర్ పొడవు 158 కి.మీ.లుగా ఉంటే రీజినల్ రింగ్ రోడ్ పొడవు 340 కి.మీ.లుగా ఉన్నది..ఔటర్ లోపలి వైపున 455 చెరువులు ఉన్నాయి. వీటిల్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు సంచలనంగా మారాయి. ఇంకా చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉన్నది. ఇప్పట్లో గ్రేటర్ పరిధిలోని చెరువుల వైపు అక్రమార్కులు తొంగిచూసే పరిస్థితి లేదనేది స్పష్టమవుతున్నదని ప్రభుత్వ భావన. ఔటర్ వెలపల ఉన్న చెరువులు 2402గా ఉన్నాయి. వీటిపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టినందున హైడ్రాను విస్తరించాలని నిర్ణయించింది. దీంతో హైడ్రా పరిధిలోకి మొత్తం చెరువులు 2852గా రానున్నాయి.

ఈ చెరువుల్లోకి నిర్మాణాలు రాకుండా చేస్తే చాలు వాటిని కాపాడినట్టేననేది అధికార వర్గాల్లోని అభిప్రాయం.హైడ్రాను విస్తరిండం వల్ల చెరువుల ఉనికిని కాపాడాలని ప్రభుత్వం భావిస్తుందని అధికారులు వెల్లడించారు. 2852 చెరువుల చర్యలపై ఇప్పుడే దృష్టిసారిస్తే రానున్న రోజుల్లో కబ్జాలు మరింత తగ్గుముఖం పడుతాయనేది రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు చెరువుల్లోకి వచ్చి చేరుతున్న మురుగునీటిని కూడా అరికట్టే అవకాశాలున్నాయనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.

పాత తేదీల్లో అనుమతులకు..అక్రమార్కులకు చెక్
భూవినియోగం పెరుగడం, భూములకు విపరీతంగా డిమాండ్ రావడంతో అక్రమార్కులు చెరువులను చెరబడుతున్నారేది బహిరంగ రహాస్యం. పాత తేదీల్లో, గ్రామపంచాయితీల నుంచి భవన నిర్మాణ అనుమతులు తీసుకుని యదేచ్చగా చెరువుల్లోకి చొచ్చుకుని వస్తూ నిర్మాణాలు సాగిస్తున్న విషయం హైడ్రా ప్రవేశంతో వెలుగులోకి వచ్చింది. ఈతరహాలోనే పాత తేదీల్లోని అనుమతులతో చెరువుల్లో నిర్మాణలు చేపట్టాలంటేనే జంకాల్సిన పరిస్థితులను తీసుకువచ్చేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పరిధిని విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. గండిపేట్‌లో, మల్లంపేట్ కత్వాలోనూ పాత తేదీల్లో, గ్రామపంచాయితీల గడువు ముగిసిన అనంతరం కూడా పాత తేదీల్లో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం వల్ల చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనీ ప్రభుత్వం యోచన. ప్రస్తుతం ఔటర్ వెలుపల 2402 చెరువులు ఉన్నాయి. వీటిల్లోకి నిర్మాణాలు లేఅవుట్లు రాకుండా చేయాలంటే హైడ్రాను విస్తరించాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News