Sunday, December 22, 2024

విజయవాడ ఆర్‌టిసి బస్టాండ్‌లో కొట్టుకున్న ఇద్దరు డ్రైవర్లు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇద్దరు ఆర్‌టిసి డ్రైవర్లు విజయవాడ బస్టాండ్‌లో కొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం రెండు బస్సులు ప్లాట్‌ఫామ్ పైకి వచ్చే క్రమంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. జమ్మలమడుగు డిపో డ్రైవర్‌పై కల్యాణదుర్గ డిపో డ్రైవర్ పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పలుమార్లు జమ్మలమడుగు డ్రైవర్‌ను కాలుతో తన్నాడు. బస్సు ఆన్‌లో ఉండడంతో ప్రయాణికులు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్లను విడిపించేందుకు ప్రయాణికులు ప్రయత్నించారు. ఇద్దరు డ్రైవర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News