- Advertisement -
హైదరాబాద్: బ్యాక్ వర్డ్ క్లాస్ కుల గణనై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో బిసి కుల గణన చేపట్టి నివేదిక ఇవ్వాలంది. బిసి కులగణన చేపట్టాలని బిసి సంఘం నేత ఎర్ర సత్యనారాయణ 2019లో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
బిసి కులగణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. అయితే కులగణన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
బిసి కులగణన మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక పిటిషన్ పై విచారణ ముగిసినట్లు ప్రకటించింది.
- Advertisement -