Sunday, December 22, 2024

సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయని డాక్టర్లు

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో విధులను బహిష్కరించిన జూనియర్‌ డాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, డిమాండ్లు నెరవేర్చే వరకు విధుల్లో చేరబోమని జూనియర్‌ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

డిమాండ్ల నెరవేర్చకపోతే సమ్మె కొనసాగిస్తామని ఆందోళన చేపడుతున్న వైద్యుల్లో ఒకరు తెలిపారు. కోల్‌కతా పోలీస్ కమీషనర్, హెల్త్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అండ్‌ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను సాయంత్రం 5 గంటల్లోగా తొలగించామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని.. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ రూమ్‌లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మృతదేహం లభ్యమైన కొద్ది గంటలకే జూనియర్ డాక్టర్లు ఆగస్టు 9న తమ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

ఇదిలావుండగా ఆర్థిక అవకతవకల కేసులో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సెక్యూరిటీ గార్డు అఫ్సర్ అలీతో పాటు ఇద్దరు సహచరులు, కాంట్రాక్టర్ వెండర్ బిప్లబ్ సిన్హా, సుమన్ హజ్రాలకు కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అవసరమైతే మళ్లీ కస్టడీని కోరుతామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఆర్‌జి కర్ ఎంసిహెచ్‌లో వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనల మధ్య ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సందీప్ ఘోష్‌ను సిబిఐ ఈ నెల 2న అరెస్టు చేసింది.  3 న  కోర్టులో హాజరుపరుచగా ఎనిమిది రోజులపాటు సిబిఐ కస్టడీకి పంపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News