Thursday, September 19, 2024

మళ్లీ గోదా’వర్రీ’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/బూర్గంపాడు/భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన మహారాష్ట్రచత్తీస్‌గఢ్ ప్రాంతాలలో నదీపరివాహకంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదవరి నది ఉప్పోంగుతోంది. ప్రాణహిత , వార్ధ తదితర ఉపనదుల ద్వారా భారీగా వదరనీరు గోదావరిలోకి చేరుతోంది. దీంతో నదిలో నీటిప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. భద్రాచలం వద్ద సో మవారం నదిలో 26అడుగులు ఉన్న నీటిమ ట్టం కేవలం 24గంటల వ్యవధిలోనే 20అడుగులకు పైగా పెరిగిపోయింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాలు, కల్యా ణ కట్ట వద్ద చాలా మెట్లు వరదనీటిలో మునిగాయి. శబరి నది పోటెత్తడంతో భద్రాచలం ది గువన ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి నీరు చేరి పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన శ్రీరాం సాగర్ ప్రాజెక్టునుంచి వరదనీరు 55013క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 16633క్యూసెక్కులు విడుదలవుతోది. దిగువన మేడిగడ్డ వద్ద నదిలో 4.06లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజి మీదుగా ప్రవహిస్తోంది. తుపాకుల గూడెం సమ్మక బ్యారేజి మీదుగా 10.29లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం వద్ద నదిలో నీటి ప్రవాహం 11.43లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. భద్రాచలం వద్ద మంగళవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరినదిలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర జలసంఘం హెచ్చరించింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మరింత పెరుగుతుందని, లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి లక్షా 50 వేల క్యూసెక్కుల వరద వస్తోందని అన్నారు. ఇంద్రావతి, సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి ప్రవాహం వస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుంచి దిగువకు 10,32,816 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది. పట్టణంలో బ్యాక్ వాటర్‌ను ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా స్లూయిజ్‌ల వద్ద గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నారు. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

తాలిపేరు ప్రాజెక్టుకు తగ్గిన వరద ఉద్ధృతి :
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరదనీటి ఉద్ధృతి తగ్గింది. ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి వరద 50 అడుగులకు చేరినట్లయితే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు ప్రయాణాలు నిలిచిపోయే అవకాశం ఉంది. గణేశ్ ఉత్సవాలు ముగుస్తున్న సందర్భంగా భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనానికి వినాయక విగ్రహాలు తెచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. అందుకోసం మూడు లాంచీలు, ఆరు క్రేన్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేసినట్లుగా వెల్లడించారు.

నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గత కొద్ది రోజులుగా వర్షపాతం తక్కువ కావడంతో గోదావరి వద్ద ఇప్పుడు వరద నీరు నిలకడగా ప్రవహిస్తున్నట్లు సిడబ్లూసి అధికారులు తెలిపారు. పాణహిత, గోదావరి నదుల నుంచి 4.29 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద అధికారులు 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతానికి కాళేశ్వరం వద్ద 8 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News