Friday, September 20, 2024

విశ్వం నుంచి మొరాకో మగువా పాట విడుదల…

- Advertisement -
- Advertisement -

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మేకర్స్ ఎలక్ట్రిఫైయింగ్, గ్రూవీ నంబర్ ‘మొరాకో మగువా…’తో మ్యూజికల్ జర్నీ కిక్ స్టార్ట్ చేశారు. చేతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ డైనమిక్ సాంగ్‌కు పృధ్వీ చంద్ర, సాహితీ చాగంటి ఎనర్జిట్ వోకల్స్ అందించారు. లైవ్లీ టెంపో, షిఫ్టింగ్ రిధమ్స్‌తో సాంగ్ అదిరిపోయింది.

రాకేందు మౌళి లిరిక్స్ తెలుగు, ఇంగ్లీష్‌ని అద్భుతంగా మిళితం చేసింది. గోపీచంద్, కావ్య థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీ, ఎలిగెన్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశారు. ఎక్సోటిక్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మొరాకో మగువా సాంగ్ మ్యూజిక్ ప్రమోషన్‌లకు చార్ట్ బస్టర్ స్టార్ట్ ఇచ్చింది. ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News