Sunday, December 22, 2024

నెపోటిజంపై రకుల్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

సీని ఇండస్ట్రీలో నెపోటిజపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలాసార్లు నెపోటిజం వల్ల తాను కొన్ని అవకాశాలు కోల్పోయానని రకుల్ ప్రీత్ వెల్లడించారు. కానీ ఈ విషయంలో తానెప్పుడూ బాధపడలేదని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. ‘స్టార్ కిడ్స్‌కు సినిమాల్లో ఈజీగా అవకాశాలు రావడానికి కారణం వారి పేరెంట్స్ పడిన కష్టమే. నేను కూడా భవిష్యత్తులో నా పిల్లలకి అవసరమైతే సాయం చేస్తాను. లైన్‌లో నిలబడి అదృష్టాన్ని పరీక్షించుకోండి అని చెప్పను’ అని అన్నారు.

కాగా, టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితోనూ నటించిన రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్ కే  పరిమితమయ్యారు. ఇటీవల తన బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిని జాకీ భగ్నానీని రకుల్ ప్రీత్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News