Tuesday, December 3, 2024

ఏచూరి మృతి పట్ల సిఎం రేవంత్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సిఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని.. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అన్నారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితులయ్యారన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని సీఎం రేవంత్ అన్నారు.

కాగా..ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఏచూరి కున్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా చికిత్స కోసం ఇటీవల ఎయిమ్స్‌లో చేరిన ఆయన.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News