Thursday, December 19, 2024

ప్రజల కోసం రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

ప్రజల కోసం తన పరదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. హత్యకు గురైన ఆర్‌జి కార్ ఆసుపత్రి డాక్టరుకు న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. ఆర్‌జి కార్ ఆసుపత్రి ప్రతిష్టంభన నేడు ముగిసిపోతుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని గురువారం విలేకరుల సమావేశంలో మమత తెలిపారు.

సచివాలయానికి వాళ్లు(డాక్టర్లు) వచ్చారు కాని సమావేశంలో మాత్రం కూర్చోలేదని ఆమె అన్నారు. విధులకు తిరిగి వెళ్లాలని వారిని అర్థిస్తున్నానని మమత అన్నారు. గత మూడు రోజులుగా తాను సదుద్దేశంతో తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చర్చలు జరిపేందుకు మెడికోలు నిరాకరించారని, ప్రజల కోసం రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమని మమత ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News