వామపక్ష కూటమి పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపురలలో అధికారంలో ఉండి, నేషనల్ ఫ్రంట్ వగైరాల పేరిట సాగుతుండిన ప్రతిపక్ష రాజకీయాలలో ముఖ్య పాత్ర వహిస్తుండినప్పటికీ, వామపక్షాలు ప్రజోద్యమాలకు క్రమంగా దూరమవుతూ అధికార రాజకీయాలకు పరిమితమవుతున్నాయనే పేరూరా సాగింది. ఆ విధంగా ఈ పార్టీల బలాబలాలలోని హెచ్చుతగ్గులు ప్రజోద్యమ రాజకీయాల కన్న ఎక్కువగా ప్రతిపక్ష రాజకీయాలతో ముడిపడ సాగాయి. ఆ కారణాల మూలంగా కమ్యూనిస్టులకు ఇతర పార్టీల నుంచి సవాళ్లు పెరగటం, వాటిని పార్టీ నాయకత్వాలు సరిగా తట్టుకోలేకపోవటం, ఆ క్రమంలో వామపక్షాల బలహీనతలు బయటపడటం అనే దశ ప్రారంభమైంది.
సరిగా ఆ దశలో సీతారాం జెఎన్‌యులోని వామపక్ష క్యాంపస్ రాజకీయాల నుంచి పార్టీ రాజకీయాలలోకి ప్రవేశించారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జెఎన్‌యు విద్యార్థి సంఘానికి వరుసగా మూడు సార్లు అధ్యక్షునిగా ఎన్నిక కావటం, తను చదువుతుండిన ఆర్థిక శాస్త్రంలో ప్రతిభావంతునిగా పేరు రావటం, జెఎన్‌యు వంటి చోట చదివినందున అంతర్జాతీయ వ్యవహారాలతో మంచి పరిచయం, భాషపై పట్టు, మంచి ఉపన్యాసకుడు కావటం, రచనాశక్తి, తార్కికంగా చర్చించి ఎదుటి వారిని మెప్పించగలగటం, ఆవేశానికి లోనుకాకుండా విషయాలను ఓపికగా, నేర్పుతో చర్చించి వివరించగల లక్షణం, సౌమ్యత వంటివన్నీ కలిసి ఆయనను పొలిట్ బ్యూరో సభ్యుడిని చేశాయి. ఇటువంటి నేపథ్యమంతటితో ఆయన మొత్తం దేశంలోనేగాక ఇతర దేశాలలోనూ వామపక్ష వర్గాలకు సుపరిచితుడయ్యారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శిగా చిరకాలం పని చేసి గురువారం నాడు అనారోగ్యంతో మరణించిన సీతారాం ఏచూరిని భారత దేశ కమ్యూనిజంలో నవతరం నాయకునిగా పరిగణించవలసి ఉంటుంది. దేశంలో పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ, సిపిఎంలనే ప్రధాన పార్టీలుగా పరిగణించినట్లయితే, వాటి ప్రధాన కార్యదర్శులలో సీతారాం మాత్రమే నవ తరానికి చెందినవాడు. దానితోపాటు సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, జెఎన్‌యు వంటి ఉన్నత స్థాయి విద్యా సంస్థలలో చదివిన ఆధునికుడు కూడా. ఆ విధమైన గుర్తింపులు ఆయనకు వామపక్ష ఉద్యమంలోనే గాక సాధారణ రాజకీయ రంగంలో, బయటి సమాజంలో కూడా లభించాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఇంత వరకు ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన వారందరిలో అటువంటి గుర్తింపు గల వారు ఇంకెవ్వరూ లేకపోవటం విశేషం.
అయితే, సీతారాం పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యే నాటికి, అంతకు ముందు పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఎంపికయ్యే కాలానికే సిపిఎంలో, కమ్యూనిస్టు పార్టీలలో ఒక కొత్త దశ వంటిది మొదలైంది. వామపక్ష కూటమి పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపురలలో అధికారంలో ఉండి, నేషనల్ ఫ్రంట్ వగైరాల పేరిట సాగుతుండిన ప్రతిపక్ష రాజకీయాలలో ముఖ్య పాత్ర వహిస్తుండినప్పటికీ, వామపక్షాలు ప్రజోద్యమాలకు క్రమంగా దూరమవుతూ అధికార రాజకీయాలకు పరిమితమవుతున్నాయనే పేరు రాసాగింది. ఆ విధంగా ఈ పార్టీల బలాబలాలలోని హెచ్చుతగ్గులు ప్రజోద్యమ రాజకీయాల కన్న ఎక్కువగా ప్రతిపక్ష రాజకీయాలతో ముడిపడ సాగాయి. ఆ కారణాల మూలంగా కమ్యూనిస్టులకు ఇతర పార్టీల నుంచి సవాళ్లు పెరగటం, వాటిని పార్టీ నాయకత్వాలు సరిగా తట్టుకోలేకపోవటం, ఆ క్రమంలో వామపక్షాల బలహీనతలు బయటపడటం అనే దశ ప్రారంభమైంది.
సరిగా ఆ దశలో సీతారాం జెఎన్‌యులోని వామపక్ష క్యాంపస్ రాజకీయాల నుంచి పార్టీ రాజకీయాలలోకి ప్రవేశించారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జెఎన్‌యు విద్యార్థి సంఘానికి వరుసగా మూడు సార్లు అధ్యక్షునిగా ఎన్నిక కావటం, తను చదువుతుండిన ఆర్థిక శాస్త్రంలో ప్రతిభావంతునిగా పేరు రావటం, జెఎన్‌యు వంటి చోట చదివినందున అంతర్జాతీయ వ్యవహారాలతో మంచి పరిచయం, భాషపై పట్టు, మంచి ఉపన్యాసకుడు కావటం, రచనాశక్తి, తార్కికంగా చర్చించి ఎదుటి వారిని మెప్పించగలగటం, ఆవేశానికి లోనుకాకుండా విషయాలను ఓపికగా, నేర్పుతో చర్చించి వివరించగల లక్షణం, సౌమ్యత వంటివన్నీ కలిసి ఆయనను పొలిట్ బ్యూరో సభ్యుడిని చేశాయి. ఇటువంటి నేపథ్యమంతటితో ఆయన మొత్తం దేశంలోనేగాక ఇతర దేశాలలోనూ వామపక్ష వర్గాలకు సుపరిచితుడయ్యారు.
చివరకు ప్రధాన కార్యదర్శి నియామకం ప్రస్తావన వచ్చినపుడు నిజానికి అది అంత సాఫీగా ఏమీ జరగలేదు. సీతారామ్ విద్యార్థి ఉద్యమాలు, ఒక మహా నగర నేపథ్యం, ప్రతిపక్ష రాజకీయాలలో అనుభవం తప్ప, క్షేత్ర స్థాయిలో ప్రజా ఉద్యమాలలో ప్రవేశం లేకపోవడం సిపిఎం వంటి ఉద్యమ పోరాటాల కమ్యూనిస్టు పార్టీలో పలువురికి ఒక పెద్ద వెలితిగా కన్పించింది. అయితే, పైన చెప్పుకున్నట్లు అసలు దేశం లో కమ్యూనిస్టు పార్టీలే తమ సుదీర్ఘ చరిత్రలకు భిన్నమైన దశలోకి క్రమంగా ప్రవేశిస్తుండిన సంధి కాలం లేదా పరివర్తనా దశ అయినందున చివరకు సీతారాం వంటి ఆధునికుడు, ప్రజోద్యమాల నేపథ్యం ఏమీ లేకున్నా, ఇతర సానుకూల లక్షణాల బలంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అయినప్పటికీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర వంటి చోట్ల పలువురు పోరాట చరిత్ర గల కామ్రేడ్స్‌లో అసంతృప్తి, విమర్శలు కొనసాగాయి. సీతారాం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కాలాన్ని సమీక్షిస్తే, వాస్తవానికి సిపిఎం గాని, సాధారణ రూపంలో కమ్యూనిస్టులు గాని పార్టీలను, ఉద్యమాలను, చివరకు చట్టసభలలో బలాలను ముందుకు తీసుకు వెళ్లగలిగింది కన్పించదు.
పైగా అందుకు భిన్నంగా సిపిఎంతో సహా అందరూ క్రమంగా బలహీనపడుతూపోయారు. ఇది అందరూ గమనిస్తూనే ఉన్నది గనుక అందుకు వేరే రుజువులు అక్కర లేదు. అయితే పరిస్థితులు ఈ విధంగా పరిణమించటానికి సీతారాంను మాత్రమే బాధ్యునిగా ఎంత మాత్రం చేయలేము. పైన చెప్పుకున్నట్లు వివిధ కారణాల వల్ల, అనేక రూపాలలో ఈ బలహీనతలు మౌలికంగా భారత కమ్యూనిస్టు ఉద్యమంలోనే ప్రవేశించాయి. వాటిని సీతారాం కాదు గదా మరెవరూ మార్చగల అవకాశం లేకపోయింది. ఎందరో మహామహులు ఉండిన బెంగాల్, కేరళ, త్రిపురలలోనే పార్టీని ఈ బలహీనతలు, ఆ కారణంగా వైఫల్యాలు ఆవరించి క్షీణింపజేసిన స్థితిలో, సీతారాం వంటి వ్యక్తి మాత్రుడు, అందులోనూ ప్రజోద్యమాల నేపథ్యం, పునాదిలేని ఆధునికుడు పరిస్థితిని మార్చగలగటం అసంభవమని చెప్పక తప్పదు. అదే జరిగింది కూడా. ఇదంతా ఎట్లున్నా, సీతారాం తనకు గల అనేకానేక వ్యక్తిగత ప్రతిభల కారణంగా సిపిఎం వంటి పార్టీకి ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదగటాన్ని గుర్తించి ప్రశంసించక తప్పదు.
టంకశాల అశోక్
9848191767