Sunday, December 22, 2024

బీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి: అరికెపూడి గాంధీ

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది. నిన్న అరికెపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో లోకల్, నాన్ లోకల్ అంటూ కౌశిక్ రెడ్డి కొత్త వివాదానికి తెరలేపాడు. తాజాగా ఈ వివాదంపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన ఇంట్లో అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

పాడి కౌశిక్ రెడ్డిని తక్షణమే BRS పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, అరికెపూడి ఇంటికి వెళ్లేందుకు కౌశిక్ రెడ్డి, శంబిపూర్ రాజు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డిని, శంబిపూర్ రాజును ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని లోపలికి పంపించి హౌస్ అరెస్ట్ చేశారు. అరికెపూడి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News