- Advertisement -
ప్రస్తుతం కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణ కారణంగా మరణించిన 29 మంది రోగుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం అందచేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. జూనియర్ డాక్టర్లు దీర్ఘకాలంగా చేస్తున్న విధుల బహిష్కరణ కారణంగా ఆరోగ్య సేవలకు విఘాతం ఏర్పడి 29 విలువైన ప్రాణాలను మనం కోల్పోవడం దురదృష్టకరమని ఎక్స్ వేదికగా మమత పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందచేస్తుందని ఆమె ప్రకటించారు. ఆర్ జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో పోస్టు గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటన దరిమిలా ఆగస్టు 9వ తేదీ నుంచి జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టారు.
- Advertisement -