పర్యాటకుల కోసం థాయ్ ఎయిర్ ఏషియా ఆఫర్‌ను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లే వారి కోసం టికెట్‌ను కేవలం రూ.7,390 లకే అందించనుంది. ఎయిరేషియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.7,390లు, చెన్నై నుంచి ఫుకెట్‌కు రూ.6,990లకే ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఏషియా తెలిపింది. ఇప్పటికే వైజాగ్ సహా దేశంలోని 12 నగరాలకు థాయ్‌ల్యాండ్ నుంచి విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఈ సంస్థ, కొత్తగా హైదరాబాద్ – బ్యాంకాక్ సర్వీసులో ప్రయాణించే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 27వ తేదీ నుంచి హైదరాబాద్ -టు బ్యాంకాక్ సర్వీస్, చెన్నై -టు ఫుకెట్ సర్వీసులను
అక్టోబరు 30వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద ఈ నెల 22 వరకు రాయితీ టికెట్లు ఎయిరేషియా.కామ్, ఎయిరేషియా మూవ్ యాప్‌లో విక్రయిస్తామని ఈ సంస్థ తెలిపింది. హైదరాబాద్ -టు బ్యాంకాక్‌ల మధ్య 2024 అక్టోబర్ 27వ తేదీ నుంచి 2025 మార్చి 29వ తేదీ వరకు, చెన్నై -టు ఫుకెట్ల మధ్య 2024 అక్టోబర్ 30వ తేదీ నుంచి 2025 మార్చి 29వ తేదీల మధ్య ప్రయాణానికి వీటిని కొనుగోలు చేసుకోవాలని ఈ సంస్థ సూచించింది. భారత ప్రయాణికులు థాయ్‌ల్యాండ్ వచ్చేందుకు వీసా అవసరం లేదని, పాస్‌పోర్టు ఉంటే సరిపోతుందని ఈ సంస్థ పేర్కొంది.