Saturday, December 21, 2024

సూర్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులకు బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం సూర్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కంగువా మరోసారి వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఇది సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దీంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న వెట్టయ్యాన్ కూడా అదే సమయంలో రిలీజ్ కానుంది. దాంతో తప్పనిసరి పరిస్థితులలో కంగువా సినిమాను నవంబర్ 14కు వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.

కాగా.. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News