Friday, November 22, 2024

ఉల్లి మహా ఘాటు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉల్లిబాంబులు పేలనున్నాయి..మార్కెట్లలో ఉల్లిగడ్డ ధరలు వినియోగదారులకు మళ్లీ చుక్కలు చూపబోతున్నాయి. ఇప్పటికే కిలో ఉల్లి ధరలు ఆర్ధ సెంచరీ దాటేశాయి. కేంద్ర ప్ర భుత్వం శుక్రవారం నాడు తీసుకున్న తాజా నిర్ణయం తో ఇక ఉల్లి ధరలు సామాన్యుల కంట కన్నీరు పెట్టించబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై ఆక్షలను సడలించింది. కనీస ఎగుమతి ధరల నిబంధనలను కూడా ఎత్తివేసింది. ఈ మేరకు డిజిఎస్‌టి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి రానుందని కేంద్ర ప్రకటించింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆంక్షలు విధించింది. తొలుత ఉల్లిపై 40శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ ఏడాది మే నెలలో ఎగుమతుల సుంకం తొలగించినప్పటికీ ఉల్లిధరలు టన్నుకు 550డాలర్లుగా కనీస ధరలను నిర్ణయించింది. అంతకంటే తక్కువ ధరకు ఉల్లిని రైతులు ఎగుమతి చేయడానికి వేలు లేకుండా ఆంక్షలు విధించింది. దేశంలో పండించే ఉల్లి పంట ఎగుమతుల రూంపలో విదేశాలకు తరలిపోతే దేశీయంగా మార్కెట్లలో ఉల్లిధరలు పెరిగిపోయి వినియోగదారులు బెంబేలెత్తిపోతారన్న అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఉల్లి పంట లభ్యతను పెంచాలన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం నిర్ణయం ప్రజలపాలిట ఆశనిపాతం:
కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంట ఎగుమతులపై తీసుకున్న నిర్ణయం అన్నివర్గాల ప్రజల పాలిట అశనిపాతంలా మారనుందన్న అందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వ్యక్తమవుత్నున్నాయి. మహారాష్ట్రలోనే ఉల్లిని ఎక్కువగా పండిస్తున్నారు. ఉల్లిపై ఎగుమతి ఆక్షంలు విధించిన నేపథ్యంలో గత కొంతకాలంగా అక్కడి రైతులు కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారు. పలు ప్రాంతాల్లో ఉల్లి రైతులు ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ పర్థితులు గత లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ప్రభావమే చూపాయి. నాసిక్ ప్రాంతంలో ఉల్లి రైతుల ఆగ్రహన్ని చవిచూసినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాధ్ శిండే స్వయంగా ప్రకటించారు. ఈ నేపధ్యలోనే ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు తొలగించిందన్న విమర్శలు వస్తున్నాయి.
దేశీయంగా భారీ వర్షాలతో తగ్గిన ఉల్లిసాగు:
ఒక వైపు దేశీయంగా భారీ వర్షాలతో ఉల్లిపంట సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. మరో వైపు ఆకాల వర్షాలు అధిక వర్షాల వల్ల సాగు చేసిన ఉల్లి పైర్లు కూడా దెబ్బతిన్నాయి. ఎకరానికి 150క్లింటాళ్ల మేరకు ఉల్లి పంట దిగుబడులు రావాల్సిఉండగా , ఈ సారి పంట దిగుబడి ఎకరానికి 100క్లింట్లాళ్లలోపే ఉంటోంది. మార్కెట్లకు కొత్త ఉల్లిపంట రాక తగ్గిపోయింది. దీంతో గత వారం పదిరోజులుగా మార్కెట్లలో ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఉల్లి ధరలు క్వింటాలుకు రూ.3000 నుంచి 3500 వరకు ఉండేవి. ఈ సారి ఇప్పటికే 4500నుంచి రూ.5000 ధర పలుకుతున్నాయి. శుక్రవారం నాడు రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.50కి విక్రయాలు జరపగా, బయటి మార్కెట్లలో వ్యాపారులు కిలో ఉల్లి రూ.60 ధరతో విక్రయాలు జరిపారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషధం తొలగిస్తూ తీసుకున్న కీలక నిర్ణయం ఉల్లి ధరలను ఆమాంతం పెంచివేసేలా ఉందన్నవిమర్శలు వస్తున్నాయి. కేవలం మహారాష్ట్రలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రలోని బిజేపి ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధికోసం దేశమంతటా ఉల్లి ధరల సంక్షోభానికి ఆజ్యం పోస్తుందన్న ఆ రోపణలు అన్ని వర్గా ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కిలో వంకాయలు రూ50, టమాటా రూ.30, బెండ రూ.50, దొండ రూ.60, ఆలుగడ్డ రూ.44. కాకర రూ.50, క్యాబేజి రూ.60, కలిప్లవర్ రూ.32, దోస రూ.40, కంద రూ.60 , పచ్చిమిరప రూ 40 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక వీటికి ఉల్లి ధరలు కూడా ఎగబాకితే సామాన్యులు విలవిలలాడే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News