మనతెలంగాణ/హైదరాబాద్/సిటీబ్యూరో/ కుత్బుల్లాపూర్/శేర్‌లింగంపల్లి: పార్టీ ఫిరాయిం పులపై ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్‌రెడ్డి, అరెకపూ డి గాంధీల సవాళ్లు ప్రతిసవాళ్లతో రాష్ట్ర రాజకీ యాలలో ఒక్కసారిగా వేడెక్కింది. ఇద్దరు ఎం ఎల్‌ఎల మధ్య జరిగిన మాటల యుద్ధంతో గు రువారం మొదలైన రాజకీయవేడి రెండోరోజూ కొనసాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మా టల యుద్ధంతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కం ఠ గా మారాయి. శుక్రవారం ఎంఎల్‌ఎ గాంధీ ఇంట్లో బిఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం ని ర్వహిస్తామని నేతలు తరలిరావాలన్న ప్రకటన తో పోలీసులు అప్రమత్తమయ్యారు. శంబీపూర్ రాజు నివాసం నుంచి బయలుదేరిన పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశా రు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. దాంతో రెండో రోజు పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అరికెపూడి గాంధీ నివాసంలో బిఆర్‌ఎస్ శ్రేణులు భేటీ నిర్వహించాలనుకున్నారు. ఈ భేటీకి ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి కూడా హాజరవుతారని బిఆర్‌ఎస్ నేతలు చెప్పారు.
ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, శంభీపూర్ రాజులతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు ఎంఎల్‌ఎలు, బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. బిఆర్‌ఎస్ నాయకులను బయటికి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో బిఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పలు చోట్ల పోలీసులతో బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు వాగ్వాదానికి దిగారు. అలాగే మాజీ మంత్రులు మల్లా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి ఎంఎల్‌ఎ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్‌బి నగర్ ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి, ఉప్పల్ ఎంఎల్‌ఎ బండారు లకా్ష్మరెడ్డి, కుత్బుల్లాపూర్ ఎంఎల్‌ఎ కె.పి. వివేకానందగౌడ్, ముషీరాబాద్ ఎంఎల్‌ఎ ముఠా గోపాల్, అంబర్‌పేట ఎంఎల్‌ఎ కాలేరు వెంకటేష్‌ను హౌస్ అరెస్టు చేశారు. ఎంఎల్‌ఎ ఇళ్ల చుట్టూ పోలీసులను మోహరించడంతో వారు బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు, ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసన చేపట్టారు.
శంభీపూర్ రాజు నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు
బిఆర్‌ఎస్ మేడ్చల్ జిల్లా అధ్య క్షుడు, ఎంఎల్‌సి శంభీపూర్ రాజు చలో గాంధీ నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలన్న బిఆర్‌ఎస్ నేతల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు శంభీపూర్ రాజు నివాసం వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హుజూరాబాద్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి ఎంఎల్‌సి శంభీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, పేట్ బషీరా-బాద్ ఎసిపి ఆధ్వర్యంలో పోలీసులు ఎంఎల్‌సి శంభీపూర్ రాజు ఇంటిని తెల్లవారుజామునే చుట్టుముట్టారు. ఇంట్లో వారు బయటికి రాకుండా బయటి వారు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
హరీశ్‌రావు ఇంటి వద్ద ఉద్రిక్తత : కోకాపేటలోని మాజీమంత్రి హరీశ్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీశ్‌రావును నార్సింగి ఎసిపి రమణ గౌడ్ ఆధ్వ ర్యంలో పోలీసులు ఇంటిలో హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటికి వెళ్లే రోడ్లను పోలీ సులు అదుపులోకి తీసుకుని బారీ కేడ్లు పెట్టారు. హరీశ్‌రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇంటి ముందు బారికేట్లు ఏర్పాటు చేసి హరీశ్‌ను కలిసేందుకు వచ్చిన ప్రజలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావు భుజానికి గాయమైందని పరామర్శించడానికి వచ్చిన ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డి, మాలోతు కవితలను పోలీసులు అడ్డుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గురువారం పోలీసుల తోపులాటలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి హరీశ్‌రావు చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తానంటే పోలీసులు ముందుగా అనుమతించలేదు. అనంతరం హరీశ్‌రావును పోలీసులు చికిత్స కోసం ఎఐజి ఆస్పత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించి తిరిగి ఇంటి వద్ద దింపారు.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదనే సంయమనం పాటిస్తున్నాం : హరీశ్‌రావు
రుణమాఫీపై ప్రశ్నించినందుకు, వరదలపై నిలదీసినందుకు, ఇప్పుడు ఫిరాయింపులపై కోర్టుకు వెళ్లినందుకు.. ఇలా ప్రభుత్వంపై నిరసన గళం ఎత్తిన ప్రతిసారి ప్రతిపక్షంపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు ఆరోపించారు. బిఆర్‌ఎస్ నేతలపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమకూ దాడులు చేయొచ్చని, కానీ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగినప్పుడు డిజిపి ఎందుకు స్పందించలేదు..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా..? అని నిలదీశారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై రాళ్లదాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారని ధ్వజమెత్తారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వస్తే తమను అరెస్టు చేశారని మండిపడ్డారు.
ఖమ్మం, సిద్దిపేటలో తమపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. బిఆర్‌ఎస్ నేతలపై దాడులు జరిగితే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డిపై దాడికి సిఎం రేవంత్‌రెడ్డే కారణం అని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, సిఎంను చూసే మిగిలిన నేతలు నేర్చుకుంటారని వ్యాఖ్యానించారు. అరెకపూడి గాంధీని గురువారమే హౌస్ అరెస్టు చేసి ఉంటే కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగేది కాదని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్యం గురించి అమెరికాలో మాట్లాడుతున్నారని, తెలంగాణలో అరాచకపాలన గురించి రాహుల్‌గాంధీ మాట్లాడాలని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును పక్కదారి పట్టించడానికే కౌశిక్‌రెడ్డిపై దాడికి దిగారని హరీశ్‌రావు ఆరోపించారు. రుణమాఫీపై ప్రశ్నిస్తే సిద్దిపేటలో కార్యాలయంపై దాడి చేశారని, వరదలపై ప్రశ్నిస్తే ఖమ్మంలో దాడి చేశారని అన్నారు. తమపై ఎన్ని రాళ్లు వేస్తావో వేయండి, వాటితోనే మళ్లీ అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు.
బిఆర్‌ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలి : రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. అరెస్టు చేసిన బిఆర్‌ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బిఆర్‌ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బిఆర్‌ఎస్ శ్రేణులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంఎల్‌ఎలపై దాడి చేసిన గాంధీ, వారి అనుచరులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ కుట్రతోనే రేవంత్ సర్కార్ ప్రాంతీయ విబేధాలకు తెరలేపుతోంది : కౌశిక్‌రెడ్డి
రాజకీయ కుట్రతోనే రేవంత్ సర్కార్ ప్రాంతీయ బేధాలకు తెరలేపుతుందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి ఆక్షేపించారు. రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రా సెటిలర్లు అంటే తనకు గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని, రాష్ట్ర రాజధాని అభివృద్ధి కాకుండా సిఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని ధ్వజమెత్తారు. కెసిఆర్ పదేళ్ల కాలంలో ఒక్క ఆంధ్రా వారికైనా ఏమైనా ఇబ్బంది జరిగిందా..? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి నిర్బందించారని, గురువారం పోలీసులు దగ్గరుండి గాంధీకి ఎస్కార్ట్ ఇచ్చి
తనను చంపించే ప్రయత్నం చేశారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. తనను హత్య చేయాలని స్వయంగా రేవంత్ రెడ్డి ఆదేశించారని, ఈ విషయంలో సిఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీతో పాటు 30 మంది గూండాలను సైబరాబాద్ పోలీసులు ఆపలేకపోయారా..? అని ప్రశ్నించారు. ఎంఎల్‌ఎ గాంధీ మాట్లాడిన భాషను శేరిలింగంపల్లి ప్రజలు, తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు. భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రజలు గాంధీకి ఓటు వేశారా అని అడిగారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అయితే గాంధీ పార్టీ కండువా కప్పుకోవాలని అన్నారు. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి ఒక కుట్ర చేస్తున్నారని, చంద్రబాబు ట్రాప్‌లో పడి అందరినీ అమరావతి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
ఇంటికి పిలిచి రాళ్లు రువ్వారు – : అరెకపూడి గాంధీ
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి ఇంటికి ఆయన ఆహ్వానిస్తేనే వెళ్లానని, ఇంటికెళ్తే రాళ్లు, పూలకుండీలతో దాడి చేశారని ఎంఎల్‌ఎ అరెకపూడి గాంధీ ఆరోపించారు. కెసిఆర్ అంటే తనకు ఎప్పటికీ గౌరవమేనని తెలిపారు. కెసిఆర్ తమను ఆదరించి, ఆశీర్వదించారని చెప్పారు. కానీ కౌశిక్‌రెడ్డి వంటి చీడపురుగులు బిఆర్‌ఎస్‌కు మచ్చ తెస్తున్నారని విమర్శించారు. కౌశిక్ రెడ్డి లాంటి వారి వల్ల బిఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతోందని, ఆయన వల్ల కెసిఆర్ గొప్పతనానికి, గతంలో చేసిన సేవలకు చెడ్డపేరని అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అలాంటి వారి వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రజలు, మహిళలను కించపరిచే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని అన్నారు. తమపైనే బిఆర్‌ఎస్ నేతలు దాడి చేశారని, తాము ఎవరి జోలికీ వెళ్లలేదని అన్నారు. నోటికి అదుపులేని మనిషిని ఊరుమీదకు వదిలేశారని విమర్శించారు. జూనియర్ ఎంఎల్‌ఎ అయిన కౌశిక్ రెడ్డి సీనియర్ నేతనైన తనను దుర్భాషలాడారని మండిపడ్డారు.