Sunday, December 22, 2024

వార ఫలాలు (15-09-2024 నుండి 21-09-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం  చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి.  మీరు చేసే కృషిలో ఎటువంటి లోపం ఉండదు, ఆ కృషికి తగిన సాధన చేయాలి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కొంత నిదానంగా నడుస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సాఫ్ట్ వేర్, ఫాస్ట్ ఫుడ్, మెడికల్ ఫీల్డ్ లో ఉన్నవారికి ఈ వారం బాగుంది.  బుద్ధిబలంతో చేసే పనులు సానుకూలమైన మంచి ఫలితాలను ఇస్తాయి. ఫైనాన్షియల్ పరంగా ఈ వారం బాగుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు. పిల్లల విషయాలు పోటీ పరీక్షకు సంబంధించిన విషయాలు ఈ వారం కొంత కష్టపడవలసిన పరిస్థితి గోచరిస్తుంది.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య రీత్యా గైనిక్ సంబంధించి ఇబ్బందిపెడతాయి జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించండి, ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ మంత్రం పఠించడం ద్వారా  మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

వృషభం: వృషభరాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు ఉన్నప్పటికీ స్వల్ప ఆటంకాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంది. నరదిష్టి అధికంగా ఉంది. ప్రతిరోజు ఇంట్లో వ్యాపార ప్రదేశంలో ధూపం వేయండి, విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది. మంచి ఉన్నత స్థితికి ఎదగాలని ప్రయత్నిస్తారు. ఎటువంటి కష్టతరమైన పనైనా సునాశంగా చేయగలుగుతారు, అమ్మవారి అనుగ్రహం మీకు తోడుంది, ధైర్యంగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. మీరు చేసే ప్రతి పనిలో ఆర్థిక ప్రయోజనాలు చూసుకుంటారు. నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మానసిక ధైర్యం పెంచుకోండి. ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. స్నేహితులతో సన్నిహితం పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం:  మిథున రాశి  వారికి  ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో విశేషమైన లాభాలు కలుగుతాయి. ఫలితాలు కూడా బాగుంటాయి. బంధుమిత్రులతో సంబంధ, బాంధవ్యాలు మరింత బలపడతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది.  వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు . విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.  స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు వస్తుంది, కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి, ఆరోగ్యం పట్ల మెలకువ తీసుకోవాలి, ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది, వ్యాపార పరంగా నిదానంగా సాగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు వీసా వంటివి అనుకూలించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ వారం శుభసూచకం చెప్పవచ్చు, మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.ఈ రాశి వారు శివాలయంలో అభిషేకం చేయడం అలాగే సుబ్రహ్మణ్య పాశుపత రూపు లేదా కంకణం  ధరించడం చెప్పదగినద.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.అదాయ, వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా నూతనమైన మార్పులేవీ చోటు చేసుకోవు. పోటీపరీక్షలలో, ఇంటర్వ్యూలలో పాల్గొంటారు.  విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన పురోగతి బాగుంటుంది.  కుటుంబ సభ్యుల సౌకర్యం కొరకు అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రాముఖ్యతనిస్తారు.ఆరోగ్యపరంగా చర్మ సమస్యలు కొద్దికాలం ఇబ్బందిపెడతాయి. చాలా విషయాలలో స్త్రీల సహాయ సహకారాలు అందివస్తాయి. గతంలో మీరు పోగొట్టుకున్న స్థానాన్ని మీరు పొందగలుగుతారు.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. వ్యాపారపరంగా తోటివారితో  సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి ‘ప్రతివారితో సున్నితంగా వ్యవహరించండి బ్యాంకింగ్ సెక్టార్స్ లో ఉన్నవారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. లోన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.  కళాసాహిత్య, సాంస్కృతిక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మనోబలంతో, ధైర్యంతో మీరు తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. వ్యవసాయరంగంలోని వారు శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు.వారాంతంలో ఒక శుభవార్త వింటారు.  వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, మంచి సంబంధం కుదురుతుంది. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. దైవాను గ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ రాశి వారు ఆదిత్య హృదయం పాటించడం అలాగే సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన.

కన్య:    కన్య రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువ కనిపిస్తుంది ఉద్యోగం మారాలన్న మీ ప్రయత్నం ఈ వారం నెరవేరదు. గృహ నిర్మాణ పనులు ఈ వారం ప్రారంభిస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు రొటేషన్ బాగుంటాయి. బిజినెస్ ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలం కారణం . విదేశీ వ్యవహారాలు అంతగా అనుకూలించవు. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది.  జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది . వాహనయోగం ఉంది. విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య రీత్యా  జాగ్రత్త తీసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమిస్తారు దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారు సుబ్రమణ్య స్వామి అష్టకం పఠించడం మంచిది. హనుమాన్ లాకెట్ను మెడలో ధరించండి.

తుల: తులా రాశి వారికి ఈ వారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నం చేసుకున్న వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం నిదానంగా ఉంటుంది. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి ఎదురవుతుంది. అధైర్య పడవద్దు.  వీసా కి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి, షేర్ మార్కెట్ కు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకు ఈవారం కొంత బాగుందని చెప్పవచ్చు. ఫైనాన్స్ సెక్టర్, రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్ మేనేజ్మెంట్ వారికి ఈ వారం బాగుంటుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దైవ అనుగ్రహం తోడు ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగుంటాయి. నర దిష్టి అధికంగా ఉంది. ప్రతినిత్యం పఠించడం  చెప్పదగిన సూచన.

వృశ్చికం:  వృశ్చికరాశి వారికి ఈవారం  బాగుంది అని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు విహార యాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చదువుకున్న చదువుకు ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని ప్రణాళికలను రచిస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ, ఫాస్ట్ ఫుడ్, నిత్యవసర వస్తువులు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. భాగస్వామి వ్యాపారంలో మరింత పెట్టుబడులు పెట్టాలని యోచిస్తారు.  ఫైనాన్షియల్ పరంగా ఈ వారం బాగుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది .ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంత నిరాశ ఎదురవుతుంది. ప్రభుత్వంలో ఉన్న వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఈ రాశిలో జన్మించిన వారు శివారాధన ఎక్కువగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం  ఆశించిన ఫలితాలు కొలిక్కి వస్తాయి. దీర్ఘ కాలికంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన వ్యవహారం పరిష్కారం అవుతుంది. నరదిష్టి అధికంగా ఉంది. ఉద్యోగస్తులకు ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. గ్యాస్టిక్ బ్యాక్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం వుంది. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. లాభాలు నిదానంగా వస్తాయి, కొత్త ప్రాజెక్టులు చేయాలని నిశ్చయించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది, చార్టెడ్ అకౌంట్, బ్యాంకింగ్ సెక్టార్స్ లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ వారికి మొదలైన చిరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్లిపోతాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలం చెప్పవచ్చు కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది.  వీసా ఇంటర్వ్యూ లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అదృష్ట కాలమని చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ ప్రతిఫలం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. దైవదర్శనాలు చేయాలనుకుంటారు. ఒకసారి అరుణాచలం వెళ్లి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మకరం:   మకర రాశి వారికి  ఈ వారం  చేపట్టిన పనుల్లో మంచి పురోగతి బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు. పిల్లలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారి భవిష్యత్తు గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. చదువు కోసం అధికంగా ధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు అయితే అవకాశాలు గోచరిస్తుంది. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రతి అడుగు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వస్త్ర వ్యాపారస్తులకు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ వారికి బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి అనుకొని విధంగా లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది.  విద్యార్థిని విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం వలన మేలు జరుగుతుంది.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఆరోగ్యం పట్ల  జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారి విద్య పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.  ఉద్యోగంలో  ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు  వస్తాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది .  వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు  గోచరిస్తోంది.  గ్రీన్  కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు  గోచరిస్తుంది . విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.  ఈ రాశిలోని స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని  చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు వస్తాయి . ముఖ్యంగా ప్రభుత్వ  రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా గోచరిస్తోంది . జీవిత  భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినా సరే ఈ వారం సమసి పోతాయి. మనోధైర్యం  పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి .  ఈ రాశి వారికి ఏలినాటి శని వల్ల ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం శని స్తోత్రం పటించడం  చెప్పదగిన సూచన . ­

 

మీనం: మీనరాశి వారికి ఈ వారం  బాగుందని చెప్పవచ్చు . ప్రతి పనిలోనూ ఉత్సాహంగా పని చేస్తారు. విదేశాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు.  H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవకాశం గోచరిస్తోంది. వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వీసా లభించే అవకాశం గోచరిస్తోంది . ఉద్యోగపరంగా కాస్త అభివృద్ధి కనిపిస్తుంది.  ఏ పని  చేసినా సరే సంకల్ప సిద్ధి అన్నట్టుగా ఉంటుంది . నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు  తెచ్చుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు . వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుందని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు చిన్నపాటి  ఇబ్బందులు ఉన్నా సరే అధిగమించగలుగుతారు.స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది దానికి   తగ్గట్టుగా వ్యాయామం లేదా వాకింగ్ చేయడం చెప్పదగినది. విద్యార్థిని విద్యార్థులకు  కాలం అనుకూలంగా ఉంది . కష్టే ఫలినట్టుగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన  స్త్రీలకు ఈ వారం జాగ్రత్త వహించాల్సిన విషయం అని చెప్పవచ్చు . నలుగురులో మంచి పేరు  ప్రఖ్యాతాలు తెచ్చుకోవడానికి ఎంతగానో కష్టపడతారు.  సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు   తెచ్చుకోవాలని ఎంతగానో శ్రమిస్తారు . ఈ రాశి ఏలినాటి శని నడుస్తున్నందు వలన ఎనిమిది శనివారాలు శనికి  తైలాభిషేకం చేయడం అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన .

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News