Friday, September 20, 2024

సాగుకు సోలార్ సొబగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ధర్మారం:దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ పంపు సెట్ల కు సోలార్‌తో పాటు, ప్రతి ఇంటికీ ప్రభుత్వమే సో లార్ ప్యానల్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగనున్నామని ఉప ముఖ్యమం త్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. పెద్దపల్లి జి ల్లా, ధర్మారం మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం వచ్చిన భట్టి నంది మేడారంతోపాటు కటికనపల్లిలో నూతనం గా ఏర్పాటు చేయనున్న రెండు సబ్ స్టేషన్‌లకు భూమి పూజ చేశారు. అనంతరం ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ధర్మారం, గొల్లపల్లి, వెల్గటూరు, వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన రైతులు, ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ సరికొత్త ప్రయోగం ద్వారా తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలవబోతుందని అ న్నారు.

రాష్ట్రంలోని 30 గ్రామాలు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ అమర్చి, వాటి ద్వారా వ చ్చిన ప్రయోజనాలను భవిష్యత్‌లో రాష్ట్ర వ్యాప్తం గా అమలు చేస్తామని ప్రకటించారు. విద్యుత్ ఆదాతో పాటు రైతులకు సోలార్ ద్వారా మిగిలిన విద్యుత్‌ను ఆదాయంగా మలుచుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లతోపాటు ప్రతి ఇంటికీ సోలార్ ప్యానల్ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని, దీని ద్వారా విద్యుత్ వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌ద్వారా అనుసంధా నం చేసి కొనుగోలు చేయడం ద్వారా ఆ ఇంటికే తి రిగి డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. ఈ రెండు ప థకాలకు అయ్యే తరువాయి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ మోడల్ పవర్ సిస్టం అమలులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మారం వేదికగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సుమారు 50 ఏళ్ల క్రితం రామగుండంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్లాంట్ మూతపడటం, దాని స్థానంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో రూ.10 వేల కోట్ల వ్యయంతో 8 వందల కోట్ల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు త్వరలోనే భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ, విద్యుత్ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం 15 రోజుల్లోనే రూ.18 వేల కోట్లతో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామన్నారు. తాము మేనిఫెస్టోలో చెప్పకున్నా, ఎన్నికల ముందు వాగ్ధానం చేయకున్నా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రెండు లక్షల పైచిలుకు రుణమున్న రైతలకు సైతం రుణమాఫీ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు.

రెండు లక్షలపైన రైతులకు ఎంత అప్పు ఉన్నా వాటిని చెల్లిస్తే, మిగతా రెండు లక్షలు ప్రభుత్వం మాఫీ కింద అందిస్తుందని అన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. వ్యవసాయ రంగం, విద్యుత్ రంగం, ప్రాజెక్టుల విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగుతున్నామని, రైతులందరికీ ఇక మీదట పంటల ఇన్సూరెన్స్‌తోపాటు రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వచ్చే రెండేళ్లలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురాబోతుందని న్నారు. ఈ కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీ, ఎంఎల్‌సి తాటిపర్తి జీవన్ రెడ్డి, రామగుండం ఎంఎల్‌ఎ మక్కాన్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హార్కరా వేణుగోపాల్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News