- Advertisement -
సామాన్య ప్రజలకు మరో షాక్ తగిలింది. ఇటీవల కూరగాయల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో ధరలు అమాంతం పెరిగాయి. తాజాగా వంట నూనెల ధరలు కూడా పెరిగాయి. వంటనూనెలపై దిగుమతి సుంకం (ఇంపోర్ట్ డ్యూటీ)ని పెంచుతన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు వంటనూనెలపై దిగుమతి సుంకం లేదు.
తాజాగా కేంద్రం 20 శాతం వరకు పెంచేసింది. దీంతో అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటర్‌పై రూ.15 నుంచి 20 రూపాయలు పెరిగాయి. పామాయిల్ రూ.100 నుంచి రూ.115 పెరగగా.. సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.115 నుంచి రూ.130-140, వేరు శనగ నూనె రూ.155 నుంచి రూ.165కు చేరింది. పూజలకు ఉపయోగించే నూనెలనూ రూ.110 నుంచి రూ.120కి పెంచారు. దీంతో ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని ప్రజలు పెరిగిన ధరలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -