Thursday, September 19, 2024

సిఎం పదవికి రాజీనామా చేస్తా.. ఎన్నికలు నిర్వహించండి: కేంద్రానికి కేజ్రీవాల్ సవాల్

- Advertisement -
- Advertisement -

నవంబర్ లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి ఆప్ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని.. నా భవిష్యత్ ను ఓటర్లే నిర్ణయిస్తారని అన్నారు. ఆదివారం ఓ కార్యక్రమంలో సిఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మహారాష్ట్రతోపాటు ఢిల్లీలోనూ నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల వరకు మరొకరు తన స్థానంలో సీఎంగా ఉంటారని చెప్పారు. తాను అగ్నిపరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని..తాను నిజాయితీగా ఉన్నానని మీరు భావిస్తేనే మీరు నాకు ఓటు వేయండని ఢిల్లీ ప్రజలనుద్దేశించి అన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న కేజ్రీవాల్ కు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సిఎం కార్యాలయానికి వెళ్లొద్దని.. ఎలాంటి అధికారిక ఫైల్స్ పై సంతకాలు చేయకూడదని సుప్రీంకోర్టు కేజ్రీవాల్ ను ఆదేశించింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ సిఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News