Sunday, December 22, 2024

రంగారెడ్డిలో పెట్రోల్ లో వాటర్…. షాకైన వాహనదారులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని జడ్ పి రోడ్డు లో హెచ్ పి పెట్రోల్ బంకులో పెట్రోల్ లో వాటర్ రావడంతో వాహనదారులు అవాక్కయ్యారు.  వాహనదారులు ఇదేమిటని బంక్ యజమాని చంద్రశేఖర్ ను ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించాడు. పెట్రోల్ బంకును సీజ్ చేసి వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని బంకు వద్ద వాహనదారులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్ లో వాటర్ రావడంతో వాహనాల ఇంజన్ చెడిపోయిందని వాహనదారుల ఆవేదన వ్యక్తం చేశారు. నార్మల్ పెట్రోల్ ఉన్నా కూడా పవర్ పెట్రోల్ మాత్రమే బంక్ యజమాని సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News