Thursday, September 19, 2024

బాంబు దాడిలో బెంగాల్ కాంగ్రెస్ నాయకుని మృతి

- Advertisement -
- Advertisement -

పశ్చిమబెంగాల్ మాల్డా జిల్లాలోని ధర్మపూర్ స్టాండ్ మార్కెట్ వద్ద ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన బాంబు దాడిలో కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ సైఫుద్దీన్ ప్రాణాలు కోల్పోయారు. ధర్మపూర్ లోని తన ఇంటి నుండి మార్కెట్‌కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. నిందితులు నలుగురైదుగురు ముఖాలకు ముసుగులు వేసుకుని తుపాకీ కాల్పులతోపాటు నాటు బాంబులతోదాడి చేశారని పోలీస్‌లు వెల్లడించారు.

సైఫుద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన స్థానిక నాయకుడు నసీర్ ఈ దాడి వెనుక ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ , మృతుని కుటుంబీకులు ఆరోపించారు. అయితే అధికార టిఎంసీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. మానిక్‌చాక్ రాష్ట్ర హైవేను దిగ్బంధించి టైర్లను తగులబెట్టారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టామని, దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి పట్టుకుంటామని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News