Thursday, September 19, 2024

సిఎం సిద్ధరామయ్య సభలో వీరాభిమానం..వేదిక వైపు దూసుకొచ్చిన యువకుడు

- Advertisement -
- Advertisement -

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగిస్తున్న సభలో భద్రతా ఉల్లంఘన జరిగింది. స్థానికంగా ఇక్కడ ఆదివారం జరిగిన సభలో వేదికపై సిద్ధరామయ్య కూర్చుని ఉండగా ఓ పాతికేళ్ల యువకుడు వేదిక వైపు దూసుకువచ్చాడు. దీనితో కలకలం చెలరేగింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి , ఆ యువకుడిని పట్టుకుని తీసుకువెళ్లారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నేపథ్యంలో సభ ఏర్పాటు అయింది.

సిఎం వైపు దూసుకువచ్చిన వ్యక్తిని మహాదేవ్‌గా గుర్తించారు.ఈ యువకుడిది కనకపురాలోని తల్గత్‌పురా అని నిర్థారించారు. ఈ యువకుడు సిద్ధరామయ్య వీరాభిమాని, వేదికపై ఉన్న నేతకు శాలువా ఇవ్వాలనే ఆలోచనతో ఈ విధంగా దూకుడుగా వ్యవహరించాడని పోలీసులు వెల్లడించారు. ఘటన తరువాత యధావిధిగా సిఎం వేదిక నుంచి ప్రసంగించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎప్పటికప్పుడూ అంతా జాగరూకతతో ఉండాలని సిఎం పిలుపు నిచ్చారు.

2500 కిలోమీటర్ల రికార్డు మానవహారం
ప్రజాస్వామ్య దినోత్సవం నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం అతి భారీ మానవ హారం ఏర్పాటైంది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలకు విస్తరించుకుంటూ సాగిన ఈ మానహారం పొడవు 2500 కిలోమీటర్లు . ఇది ప్రపంచ స్థాయి అతి పొడవైన మానవ హారంగా రికార్డులోకి చేరింది. విధాన సౌథ ఎదుట సిఎం సిద్ధరామయ్య, సీనియర్ మంత్రులు ఈ మానవహారంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News