Saturday, November 23, 2024

భారత్‌ను వైట్‌వాష్ చేస్తాం : షాంటో

- Advertisement -
- Advertisement -

ముంబై : ఇటీవల పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్ అదే ఆత్మ విశ్వాసంతో భారత్ పర్యటనకు వస్తోంది. రెం డు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా భారత్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ తొలి మ్యాచ్ చెన్నై వేదిక జరుగనుండగా రెండోది. ఈనెల 27 నుంచి కాన్పూర్‌లో జరగనుంది. అయితే ఈ సిరీస్‌ను సయితం క్లీన్‌స్వీప్ చేసి, వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలనే తహతహలాడుతోంది బంగ్లా. ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్ అంటే రోహిత్ సేనదే పైచేయి అనడం ఎలాంటి సందేహం లేదు. కానీ ఈసారి లెక్కలు మారుతాయని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో పేర్కొన్నాడు.

రెండు టెస్టులు గెలిచి, భారత్ వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని, విజ యం సాధిస్తామని నజ్ముల్ హొస్సేన్ షాంటో తెలిపాడు. ‘ఐదు రోజులు గట్టి పోటీని ఇచ్చి ఆఖరి సెషన్‌లో పైచేయి సాధించి మ్యాచ్‌లు గెలుస్తామని తమ ప్రణాళిక వివరించాడు. రెండు టెస్టులను గెలిచేలా పక్కా ప్లాన్‌తో ఉన్నాం. విజయం సాధించడానికి ప్రధానమైంది వ్యూ హం. మా పనిని సమర్థవంతంగా నిర్వర్తించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తాం. అలా చేస్తే ఫలితాలు వాటంతట అవే అనుకూలంగా వస్తా యి. ర్యాంకింగ్ పరంగా చూస్తే భారత్ మా కంటే ఎంతో ఎత్తులో ఉంది. కానీ మేం ప్రతిభాకు తగ్గట్టు ఆడితే భారత్‌ను సయితం ఓడించగలం. ఆఖరి రోజు చివరి సెషన్‌లో ఫలితం వస్తుంది. అయిదు రోజులు బాగా క్రికెట్ ఆడితే ఆఖరి సెషన్‌లో పైచేయి సాధించినవాళ్లే విజయం సాధిస్తారు’ అని షాంటో పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News