Friday, September 20, 2024

ఇండియా-బి,సి మ్యాచ్ డ్రా

- Advertisement -
- Advertisement -

అనంతపురం : దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌లో భాగంగా ఇండియాబి, సి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓవ్నట్ స్కోరు 309/7తో ఆదివారం ఆటను ఆరంభించిన ఇండియా-బి మరో 23 పరుగులే జోడించి మూడు వికెట్లు కీలక కోల్పోయి చాపచుట్టేసింది. సారథి అభిమన్యు ఈశ్వరన్ (157) అజేయంగా నిలిచాడు. ఇవాళ ఆటలో రెండు ఫోర్లు బాది 150 పరులు సాధించాడు. కానీ అన్షుల్ కాంబోజ్ దెబ్బకు మరో ఎండ్‌లో సహచరులు వరుసగా వెనుదిరిగారు.

అన్షుల్ ఏకంగా ఎనిమిది వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 27.5 ఓవర్లు బౌలింగ్ వేసిన అన్షుల్ 69 పరుగులే ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అనంతరం 193 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా-సి చివరి రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62) అర్ధశతకంతో చెలరేగాడు. రజత్ పటిదార్ (42) ఆకట్టుకున్నాడు. ఇక సెంచరీ హీరో ఇషాన్ కిషాన్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. సాయి సుదర్శన్ (11) నిరాశపరిచాడు. రాహుల్ చాహర్ రెండు, ముకేశ్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-సి 525 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇషాన్ కిషన్ (111), మానవ్ సుతార్ (82), ఇంద్రజిత్ (78), రుతురాజ్ గైక్వాడ్ (58) పరుగులు చేశారు. ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్ చెరో నాలుగు వికెట్లు తీశారు. కాగా, పాయింట్ల పట్టికలో ఇండియాసి 9 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా ఇండియాబి 7 పాయింట్లతో, ఇండియాఎ 6 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆఖరి స్థానంలో ఉన్న ఇండియాడి ఇంకా పాయింట్ల ఖాతా తెరవనేలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News