- Advertisement -
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సోమవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉగాండాకు చెందిన ఓ ప్రయాణికురాలి కడుపులో కొకైన్‌ను అధికారులు గుర్తించారు.
సినిమా తరహాలో కొకైన్ ను.. క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచి తరలించేందుకు ప్రయత్నించిన కిలాడీ లేడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పొట్టలో దాచిన 280 గ్రాముల కొకైన్ ను శస్త్రచికిత్స చేసి డాక్టర్లు బయటకు తీసినట్లు తెలుస్తోంది. పట్టుబడిన కొకైన్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3.85కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
- Advertisement -