Monday, December 30, 2024

టోక్యోలో వినాయక చవితి వేడుకలు

- Advertisement -
- Advertisement -

టోక్యో: విదేశాలలో భారతీయులు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయ‌క చ‌వితి వేడుక‌లు ఒక్క మ‌న దేశానికే ప‌రిమితం కాలేదు.. విదేశాల్లోనూ గ‌ణేశ్ న‌వ‌రాత్రులు ఘ‌నంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ‌ రాష్ట్రానికి చెందిన కొంత మంది భ‌క్తులు జపాన్ లోని టోక్యోలో వినాయ‌కుడికి నవ రాత్రుల పూజలు ఘనంగా జరిపారు. ఇక జపాన్‌లో వినాయకుడు అనేక రూపాల్లో పూజలందుకుంటున్నాడు. ప్రపంచంలోనే సాంకేతికలో జపాన్ దేశం అగ్ర స్థానంలో ఉంటుంది. అలాంటి జపాన్ ప్రజలు సైతం గణపతిని పూజిస్తారు.

ఆ దేశ ప్రజలు విఘ్నేశ్వరుడిని ‘కాంగిటెన్‌’ అని ముద్దుగా పిలుచుకుంటారు. కాంగిటెన్ అంటే ఆనంద దేవుడని ఆ దేశ ప్రజల నమ్మకం. మరి ముఖ్యంగా నాలుగు చేతుల విఘ్నేశ్వరుడునికి జపనీయులు అధికంగా పూజలు చేస్తారు. థాయ్ లాండ్, శ్రీలంకలో ముస్లిములు ఎక్కువగా వినాయకుడిని పూజిస్తారు. థాయ్‌లాండ్ లో హిందూ సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా సంబంధం ఎక్కువగా ఉంటుంది. ఈ దేశంలో ఎన్నో హిందూ దేవాలయాలున్నాయి. త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణుమూర్తి కొలువు తీరిన అంగర్‌కోట్ దేవాలయం సైతం థాయ్ లాండ్ లోనే ఉంది. అమెరికా, బ్రిటన్ లో భారతీయులు ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటారు.

Vinayaka chavithi celebrations in tokyo

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News