Thursday, November 21, 2024

యూపీలో వరదలకు 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలకు ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. గత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. గంగ,శారద, ఘఘ్రా తదితర నదులు ప్రమాదకర స్థాయి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది. ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 14 మంది చనిపోయారు.

మీరట్ లోని జాకీర్ కాలనీలో భవనం కూలిన సంఘటనలో 10 మంది మృతి చెందగా, ఇక గోండాలో ఆదివారం జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఓ మహిళ సహా ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారు. షాజహాన్‌పూర్ లోని నది నుంచి మేకను రక్షించే ప్రయత్నంలో ఇద్దరు పిల్లలు మునిగిపోయారు. మరోవైపు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News