Thursday, November 21, 2024

జెట్టీలో ఇద్దరు గర్భిణి స్త్రీలను ఆరు కిలోమీటర్లు మోసుకొచ్చిన గిరిజనులు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలోని మారుమూల బట్టిగూడేనికి చెందిన ఇద్దరు గిరిజన గర్భిణులు ఒకేరోజు ప్రసవ వేదన పడ్డారు. గ్రామంలోని రవ్వ సుబ్బమ్మ ప్రసవ వేదనతో బాధపడుతుండగా ఆమెను కుటుంబ సభ్యులు జట్టీపై ఆరు కిలోమీటర్లు తిప్పాపురం వరకు తీసుకొచ్చారు. దాదాపు నాలుగు కిలోమీటర్ల రోడ్డు అత్యంత అధ్వానంగా ఉండటంతో ఈ దారిలో ఆమెను మోసుకొచ్చేందుకు గిరిజనులు నరకం అనుభవించారు. తిప్పాపురం నుంచి ఆటోలో సత్యనారాయణపురం హాస్పిటల్ కి తీసుకువచ్చారు. అక్కడ వైద్యాధికారి దివ్యనాయన ఆమెకు ప్రాథమిక పరీక్షలు చేసి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపించారు.

కొద్ది గంటల వ్యవధిలోనే ఇదే గ్రామానికి చెందిన రవ్వ దేవి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను సైతం ఇదే దారి గుండా గిరిజనులు జట్టీపై తిప్పాపురంనకు మోసుకొచ్చి, అక్కడ నుంచి ఆటోలో సత్యనారాయణపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఈమెను 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి బాగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు. గతంలో వీరిద్దరిని బర్త్ వెయిటింగ్ రూమ్ కి రమ్మని చెప్పినా వినిపించుకోలేదని వైద్యాధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News