Thursday, September 19, 2024

ఢిల్లీ సిఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తన రాజీనామా పత్రాన్ని మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వికె సక్సేనాకు అందజేశారు. కేజ్రీవాల్ వారసురాలుగా పార్టీ ఎంపిక చేసిన ఆప్ నాయకురాలు ఆతిశీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తన సంసిద్ధతను తెలియజేశారు. పదవి నుంచి నిష్క్రమణకు తన నిర్ణయాన్ని ప్రకటించిన కొన్ని రోజుల తరువాత కేజ్రీవాల్ రాజీనామా చేయడానికి తన మంత్రివర్గ సహచరులతో కలసి మంగళవారం మధ్యాహ్నం ఎల్‌జి సెక్రటేరియట్‌కు చేరుకున్నారు.

ఆతిశీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ‘కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని మేము కోరాం. నేను ఢిల్లీ ప్రయోజనాలు కాపాడతాను’ అని చెప్పారు. ‘మేము ఈ నిర్ణయం గురించి ఎల్‌జికి సమాచారం ఇచ్చాం. ప్రభుత్వం ఏర్పాటుకు ఆతిశీ తన సంసిద్ధత తెలియజేశారు. రెండు కోట్ల మంది ప్రజల పని కొనసాగడానికి వీలుగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఒక తేదీ నిర్ణయించవలసిందిగా ఎల్‌జికి విజ్ఞప్తి చేశాం’ అని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News