ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతోపాటు పలువురు రాజకీయ న్రాయకులు, సినీ ప్రముఖులు మంగళవారం ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. నరేంద్ర మోడీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో జన్మించారు. ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన రాజకీయ ప్రముఖులలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే,
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తదితరులు ఉన్నారు. అదే విధంగా వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, అక్షయ్ కుమార్, సునీల్ షెట్టి, జాకీ ష్రాప్ తదితరులు ఎక్స్ వేదికగా ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.