Monday, December 30, 2024

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ఇంట తీవ్ర విషాదం

- Advertisement -
- Advertisement -

సినీ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్య కారణాలతో ఆయన తల్లి కన్నుమూశారు. గతకొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సోహైల్ తల్లి.. హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో సోహెల్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతదేహాన్ని స్వస్థలం కరీంనగర్ కు తరలించారు. రేపు ఆమె భౌతికకాయానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సోహెల్.. లక్కీ లక్ష్మణ్, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News