Friday, September 20, 2024

జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరక పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. జమ్ము కశ్మీర్‌లో 94 అసెంబ్లీ స్థానాలు ఉండగా 24 స్థానాలకు తొలి మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. 24 స్థానాలలో 219 మంది అభ్యర్థులు తమ భవిత్యాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి విడతలో 23 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగింకోనున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటికి పార్టీలు పోటీచేస్తున్నాయి. కానీ నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ జత కట్టి బరిలోకి దిగింది. జమ్ము కశ్మీర్ ఎన్నికలు మూడ విడుతలలో జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News